'సీసీ' లో పర్యవేక్షించి.. సమస్యల పరిష్కారం
BHNG: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈవో వెంకట్రావ్ ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ టీవీలో పర్యవేక్షిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. సీసీ కెమెరాలను కొండపైన ఉన్న కమాండ్ కంట్రోల్ రూము అనుసంధానం చేశారు. ఆదివారం సీసీ పుటేజీలను పరిశీలించి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.