అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త దారుణ హత్య
VKB: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భార్య తన భర్తను హత్య చేయించిన ఘటన చౌడపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. DCP శ్రీనివాస్ కథనం.. కవిత అనే వివాహిత రామకృష్ణతో అక్రమ సంబంధం ఉందని తన భర్త రత్నయ్య మందలించాడు. దీంతో వారి సంబంధానికి అడ్డు వస్తున్నాడని పొలం నుంచి వస్తున్న రత్నయ్యను ట్రాక్టర్‌తో ప్రియుడు ఢీ కొట్టాడు. తీవ్రగాయాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.