అంగన్వాడీ కేంద్రం పని తీరుపై కలెక్టర్ అసహనం

అంగన్వాడీ కేంద్రం పని తీరుపై కలెక్టర్ అసహనం

BPT: అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటలతో పాటు విద్యా బోధన జరగాలని కలెక్టర్ వెంకట మురళి సూచించారు. కర్లపాలెం మండలం కర్లపాలెం ఎంఎన్ రాజుపాలెంలోని కోడ్ నంబర్-128 అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీ స్కూల్ నిర్వహణపై ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్త అడిగిన ప్రశ్నలకు చిన్నారులు సరిగా స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.