మద్యం కేసుల్లో ముగ్గురు బైండోవర్: ఎక్సెజ్ సీఐ
PLD: ఈపూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం కేసులలో ఉన్న ముగ్గురు వ్యక్తులను శనివారం బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ డీ. వెంకటేశ్వర్లు తెలిపారు. సంతగుడిపాడు, కొత్తపల్లి, నల్లగర్లపాడు గ్రామాలకు చెందిన ఒక్కొక్కరిని మండల తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. సర్కిల్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు సమయ పాలన పాటించాలని సీఐ సూచించారు.