ఏడాదికి ₹48 వేలు ఆదా!
స్విగ్గీ, HDFC బ్యాంకు మరోసారి జతకట్టాయి. తాజాగా మరో రెండు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చాయి. స్విగ్గీ BLCK HDFC, స్విగ్గీ ఆరెంజ్ HDFC క్రెడిట్ కార్డులను తీసుకొచ్చారు. ఆన్‌లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్, ఫుడ్ డెలివరీ కేటగిరీల్లో లావాదేవీలపై డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి. ఏటా గరిష్టంగా రూ.48 వేల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపాయి.