జిల్లాలో కాంగ్రెస్‌కే అత్యధిక సర్పంచ్ స్థానాలు: వెడ్మ బొజ్జు
నిర్మల్: ఇటీవల నిర్వహించిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శనివారం సర్పంచ్‌లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లాలోని మొత్తం 398 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారు 250 పైగా గెలిచారని పేర్కొన్నారు.