'ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి'

'ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి'

అన్నమయ్య: మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీసం దగ్గు మందు కూడా దొరకడం లేదన్నారు. ఇదే విషయమై ఇప్పటికే సూపరిండెంట్ రమేష్ కు వినతి పత్రం అందించామని అయినా కూడా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.