ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా అలీ ఖాన్

ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా అలీ ఖాన్

CTR: ఏపీ ఎన్జీవోస్ పుంగనూరు తాలూకా అధ్యక్షుడిగా డాక్టర్ రహమత్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా డాక్టర్ రహమత్ అలీ ఖాన్, కార్యదర్శిగా శివకుమార్, కోశాధికారిగా రఘు రామయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘ జిల్లా అధ్యక్షులు రాఘవులు తెలిపారు.