మేళ్లపాకలో డంపింగ్ యార్డ్ భూమి పరిశీలన

మేళ్లపాకలో డంపింగ్ యార్డ్ భూమి పరిశీలన

TPT: డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం భూమి కేటాయింపుపై దొరవారిసత్రం మండలం మేళ్లపాక గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ప్రభుత్వ భూమిని పరిశీలించి, విస్తీర్ణం, గ్రామానికి దూరం, రహదారి సౌకర్యం వంటి అంశాలను సమీక్షించి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్‌డీవో, ఎంఆర్‌వో పాల్గొన్నారు.