సచివాలయం ముందు పురుగు మందు డబ్బాతో నిరసన

సత్యసాయి: పెనుకొండ మండలం మావటూరు గ్రామంలో శుక్రవారం రఘురాం తన కుమారుడు మరణ ధృవీకరణ పత్రం కోసం పురుగు మందు డబ్బాతో కుటుంబ సభ్యులతో కలసి సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా రఘురాం మాట్లాడుతూ తన సమస్య పరిష్కారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయం ముందు బైఠాయించారు. రోజుల తరబడి తిరుగుతున్నా సచివాలయ సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు.