ఈనెల 6 నుంచి ఉచిత క్రికెట్ శిబిరాలు

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సెయింట్ పాల్స్ హైస్కూల్ మైదానంలో ఈనెల 6 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం కానున్నట్టు ప్రధాన కోచ్ ఈ నాక్ పాల్ శనివారం తెలిపారు. ఈ శిబిరాన్ని నిజామాబాద్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సహకారంతో నిర్వహించనున్నారు.