భక్తులు సముద్ర స్నానాలకు వెళ్లొద్దు: సీఐ
NLR: కావలి రూరల్ మండలంలో కొత్త సత్రం, తుమ్మలపెంట, చెన్నాయిపాలెం గ్రామాలలో ఉన్న సముద్ర తీరాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలకు వెళ్లకూడదని రూరల్ సీఐ రాజేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటన తెలిపారు. మొంథా తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారిందని, సముద్రపు అంచులు కోతకు గురై లోతుగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.