రైతు ప్రోత్సాహకాలపై ప్రచారం చేయండి: ఎమ్మెల్యే
సత్యసాయి: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పథకాలను ప్రచారం చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.