కిరాణా షాపులో అక్రమ మద్యం పట్టివేత
NGKL: లింగాల మండల కేంద్రంలోని ఒక కిరాణా షాపుపై పోలీసులు దాడి చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా, రూ.5 వేల విలువైన మద్యం పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో మద్యం రవాణా, నిల్వలపై చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేష్ గౌడ్ శుక్రవారం తెలిపారు.