VIDEO: చేగుంటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

MDK: చేగుంట పట్టణ కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు సాయిప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ మండల అధ్యక్షుడు చింతల భూపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీద సుజాత, బీజేపీ పార్లమెంట్ ఎస్సీ మోర్చా జోనల్ ఇన్‌ఛార్జ్ కొండి స్వామి, నాయకులు సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.