VIDEO: పంచాయతీ నిధులపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ముఖ్య సూచన
KMM: గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ నిధులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. ఇప్పటికే మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలో ఖాతాల్లో నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఈ నిధులు సరైన రీతిలో ఖర్చయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. అటు సాగు విషయంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.