'నిరుద్యోగ ఎస్టీ యువకులకు శిక్షణ'
PPM: 2025-26 సంవత్సరానికి పార్వతీపురం ITDA ద్వారా నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ITDA పి.ఓ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా మొత్తం 480 మంది ఎస్టీ నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు శిక్షణ అందిస్తామన్నారు. పూర్తి వివరాలకు 8639902670 సంప్రదించాలన్నారు.