మార్జిన్ తగ్గింపుతో చికెన్ షాపుల బంద్

మార్జిన్ తగ్గింపుతో చికెన్ షాపుల బంద్

గద్వాల: కమీషన్ మార్జిన్ తగ్గింపును నిరసిస్తూ గద్వాలలో చికెన్ షాపుల యజమానులు బంద్ నిర్వహించారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ను 1.8 నుంచి 1.5కి తగ్గించడంతో తీవ్ర నష్టాలు వస్తున్నాయని అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని పాత కమీషన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.