ఎస్. కోటలో పవన్ అభిమానుల సందడి

VZM: హరి హర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఎస్.కోట పట్టణంలో థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు గురువారం ఉదయం సందడి చేశారు. బాణాసంచా కాల్చుతూ. తీన్మార్ డప్పులు, డీజే డాన్సులతో థియేటర్ వద్ద తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల బెనిఫిట్ షో మొదలైన సందర్భంగా వారు ఈ సందడి చేశామన్నారు. స్క్రీన్ పై తమ అభిమాన హీరో కనిపించగానే కేరింతలు కొట్టారు.