సంజయ్ దత్ కొత్త మూవీ టీజర్ రిలీజ్

సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'ఆఖ్రీ సవాల్' మూవీ టీజర్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. అభిజీత్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మే 8న విడుదల కానుంది. గాంధీ హత్య, బాబ్రీ మసీదు వంటి చారిత్రక అంశాల నేపథ్యంలో సాగే ఈ కథలో దత్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారు. ఆయనకు, శిష్యుడు విక్కీ(నమాషి చక్రవర్తి)కి మధ్య జరిగే సైద్ధాంతిక పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశం.