ఉపాధి హామీ పనులపై వెండర్లకు శిక్షణ
VZM: విజయనగరంలోని స్థానిక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో వెండర్లకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపౌండ్ పనులకు సంబందించి ఆన్‌లైన్‌లో టెండర్ల దక్కించుకోవడంపై అమరావతి పీఆర్ఆర్డీ కార్యాలయ అధికారి గోపీచంద్ వెండర్లతో పాటు అధికారులకు అవగాహన కల్పించారు. అలాగే పనుల నిర్వహణపై పలు సూచనలు చేశారు.