నేడు కొత్తపేటలో క్యాన్సర్ పరీక్షలు
కృష్ణా: అవనిగడ్డ మండలం కొత్తపేటలో మంగళవారం ఉదయం 9గంటల నుంచి కేన్సర్ పరీక్షలు అందుబాటులో ఉంటాయని ప్రాథమిక వైధ్యాధికారి బి.రాహుల్ ప్రభాకర్ తెలిపారు. ఈ పరీక్షలు క్యాన్సర్ కణాల ఉనికిని గుర్తించడానికి, అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయపడతాయన్నారు. పరిసర ప్రాంత వాసులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.