నాలుగు గంటల్లో పోలింగ్ శాతం ఎంతంటే.?

నాలుగు గంటల్లో పోలింగ్ శాతం ఎంతంటే.?

ఆసిఫాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకు 58.51 శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. జైనూర్లో 54.83 శాతం, కెరమెరి 70.21, లింగాపూర్ 48.25, సిర్పూర్ (యూ) 62.44, వాంకిడిలో 53.93 శాతం నమోదైంది.