పేద విద్యార్థినికి రూ. 50,000 సహాయం అందజేత
NRPT: చిట్యాల గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన ఇందు అనే విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు పొందినా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువును కొనసాగించలేని పరిస్థితిలో ఉంది. పుడమి ఫౌండేషన్, అంబేడ్కర్ యువజన సంఘం ప్రతినిధులు నర్సప్ప టీచర్ దృష్టికి తీసుకురావడంతో, వెంటనే స్పందించి సోమవారం ఇందు కుటుంబాన్ని కలిసి రూ. 50,000 ఆర్థిక సహాయం అందజేశారు.