'వంతెన కిందున్న సబ్ వేని తెరిపించండి'

VZM: విజయనగరం పట్టణంలోకి ప్రవేశించే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న కారణంగా రద్దీని తగ్గించేందుకు వీలుగా సంతకాల వంతెన కిందన నిర్మించిన సబ్ వేని తెరిపించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఎమ్మెల్యే అదితి గజపతిరాజుని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యేతో సమావేశమై నగరంలోని పలు ప్రధాన సమసలపై చర్చించారు.