రోడ్డుపై మురుగనీరు.. వాహనదారుల అవస్థలు
VZM: విజయనగరం పట్టణంలోని పూల్‌బాగ్ రోడ్డులో రాజారావు మేడ, పెద్దపల్లి వీధి మెయిన్ రోడ్డుపై మురుగునీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డంతా చెరువును తలపించేలా నిలవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.