'యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి'

JN: యువత గంజాయి, బెట్టింగ్ వంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.