RU స్నాతకోత్సవానికి మంత్రి ఆహ్వానం
NDL: రాయలసీమ విశ్వవిద్యాలయ నాలుగో స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఇవాళ మంత్రి ఫరూక్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 12న జరగనున్న స్నాతకోత్సవానికి రావాలంటూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డి మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. నేషనల్ విద్యా సంస్థల అధినేత డా.ఎస్. ఇంతియాజ్ అహ్మద్, ప్రిన్సిపల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.