శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న: మంత్రి

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని బుధవారం రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనము అనంతరం కళ్యాణమండపంలో అర్చకులు వేదమంత్రోచరణలతో ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందచేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహజన్ తదితరులు పాల్గొన్నారు.