నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
GNTR: గుంటూరులోని నెహ్రూనగర్ విద్యుత్ ఉపకేంద్రం పరిథిలోని మోతీలాల్ నగర్ ఫీడర్‌లో శుక్రవారం మరమ్మతులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నెహ్రూనగర్ 1 నుంచి 9వ లైన్ వరకు, అదేవిధంగా మోతీలాల్ నగర్‌లో విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.