వరి కోత మిషన్ కింద పడి రైతు మృతి

వరి కోత మిషన్ కింద పడి రైతు మృతి

WGL: నర్సంపేట మండలం మగ్ధుంపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రావుజి (55) తను వేసిన వరి పంటను కోసేందుకు వరి మిషన్‌ను మాట్లాడుకున్నాడు. శుక్రవారం పంటను కోయిస్తుండగా ప్రమాదవశాత్తు రావుజి ఆ యంత్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.