నిషేధించిన సిగరెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

నిషేధించిన సిగరెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో కిరాణా షాప్‌లపై పోలీసుల దాడులు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన సిగరెట్లు అమ్ముతున్న వీరయ్య అనే వ్యక్తిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. పలు కంపెనీలకు చెందిన సిగరెట్ బాక్సులు స్వాధీనం చేసుకొని చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.