నూతన తహసీల్దార్‌గా కిషోర్‌ బాధ్యతల స్వీకరణ

నూతన తహసీల్దార్‌గా కిషోర్‌ బాధ్యతల స్వీకరణ

BDK: అశ్వారావుపేట మండల నూతన తహశీల్దార్‌గా డి. కిషోర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు రెవెన్యూ సేవలను వేగవంతంగా పారదర్శకంగా అందిస్తానని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన కిషోర్‌కు రెవెన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.