BREAKING: టీమిండియా ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. భారత బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్(49*), తిలక్(29), అభిషేక్(25), సూర్య(24) సమిష్టిగా రాణించారు. దీంతో 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బౌలర్లలో ఎల్లిస్ 3 వికెట్లు తీశాడు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.