క్రీడల అభివృద్ధిపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష సమావేశం

క్రీడల అభివృద్ధిపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష సమావేశం

NRPT: తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా అభివృద్ధి లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా అకాడమీలు, క్రీడా పాఠశాలలపై సమీక్షా సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మౌలిక వసతులు, క్రీడలు అభివృద్ధి గురించి చర్చించారు. ఇందులో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.