బోయకొండలో విశేష అలంకారంలో అమ్మవారు

బోయకొండలో విశేష అలంకారంలో అమ్మవారు

CTR: చౌడేపల్లి మండలంలోని శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసంలో ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పించారు.