తాళ్లూరు సొసైటీ ఛైర్మన్‌గా ఏటుకూరి రత్నం ప్రమాణం

PLD: తాళ్లూరులో సొసైటీ ఛైర్మన్‌గా ఏటుకూరి రత్నం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆదివారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. నూతన కమిటీతో కలిసి ఆయన ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రజల పట్ల నిబద్ధతతో సేవలందించాలని, రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సొసైటీలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు.