జోగి రమేష్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
AP: నకిలీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ కోర్టు విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. జోగి రమేష్, ఆయన సోదరుడు బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నకిలీ మద్యం కేసు నిందితులు జోగి రమేష్, జోగి రాములను కస్టడీ కోరుతూ ఎక్సైజ్ అధికారులు పిటిషన్ వేయడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.