బస్సులు పునరుద్ధరించాలని డిఎంకు వినతి
SRD: ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు పునరుద్ధరించాలని సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఖేడ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యంను సర్పంచ్ మల్లగారి విమలవిఠల్ రెడ్డి, గ్రామస్తులు కలుసుకొని వినతి పత్రం ఇచ్చారు. గతంలో నడిచిన కడపల్- పిట్లం, ఖేడ్ నుంచి కడపల్ హైదరాబాద్ బస్సులను తిరిగి నడపాలని డీఎంకు విజ్ఞప్తి చేశారు.