మేఘాలయ ఉద్రిక్తతలపై స్పందించిన అమిత్ షా

మేఘాలయ ఉద్రిక్తతలపై స్పందించిన అమిత్ షా

ఇటీవల మేఘాలయలో తలెత్తిన ఉద్రిక్తతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. చొరబాటుదారులు అక్కడి ఆదివాసీ మహిళలను వివాహం చేసుకోవడం ద్వారా రాజకీయ పలుకుబడిని సంపాదించడానికి ప్రయత్నించారని అన్నారు. ఇది ఉద్రిక్తతలకు దారితీసిందని ఆయన ఆరోపించారు. అలాగే, అసోంలో తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.