ఆర్టీసీ సమ్మె విరమించండి.. మంత్రి విజ్ఞప్తి
MLG: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి సీతక్క కోరారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. కార్మికుల సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసి 4 వారాల్లో నివేదిక రానుందని చెప్పారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆర్టీసీపై ఆధారపడుతున్నందున సమ్మె వల్ల ఇబ్బందులు కలగకూడదన్నారు.