'ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలు'
BHNG: గుండాల మండలం పాచిల్ల గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి నూతన ఆలయ నిర్మాణం కోసం పలువురు దాతలు ముందుకొచ్చారు. మండలానికి చెందిన మదరబోయిన నరసింహ రూ.20 వేలు, అత్తి హరిప్రసాద్ రూ.11 వేలు ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో పాచిల్ల గ్రామ పంచాయతీ పాలక వర్గం పాల్గొన్నారు.