హనుమాన్ జయంతి రూట్ మ్యాప్ పరిశీలించిన సీపీ
HYD: ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి నేపథ్యంలో తాడ్ బంద్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను సీపీ పరిశీలించారు. తాడ్ బంద్ దేవాలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లతో పాటు భద్రత చర్యలను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.