నరసాపురంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

నరసాపురంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

W.G: నరసాపురం సర్ ఆర్థర్ కాటన్ పార్క్‌లో జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ దినోత్సవ వారోత్సవాల్లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలిపి, వారితో కలిసి పార్క్‌లో గడిపారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ పుస్తకాలతో స్నేహం చేస్తేనే జ్ఞానవంతమైన, చైతన్యవంతమైన సమాజం తయారవుతుందన్నారు.