చెంగాళమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు పూర్తి..!
TPT: శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. గత 48 రోజులకు గాను ఆలయానికి రూ.28,71,400 నగదు ఆదాయం సమకూరింది. వీటితో పాటు 80 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి కానుకలను భక్తులు సమర్పించారు. అన్నదాన నిధికి అదనంగా రూ.91,081 విరాళాలు వచ్చాయి. అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది, భక్తుల సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పూర్తయింది.