ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమ: అల్లవరం మండలం కొమరగిరిపట్నం మెట్ల రామ్మూర్తి సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో PACS ఛైర్మన్ మెట్ల రమణబాబు, అముడా ఛైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, కొమ్మూరు సత్తిబాబు పాల్గొన్నారు.