వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్‌కు భారత్ ఆతిథ్యం
ప్రతిష్టాత్మక 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు భారత్ వేదిక కానుంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంను పరిశీలించిన అనంతరం వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ హక్కులు దక్కించుకున్న భారత్‌కు ఇది మరో భారీ గౌరవం. అథ్లెటిక్స్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని IAF అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు.