నేడు ఉచిత రక్త పరీక్షలు
SKLM: పలాస మున్సిపాలిటీలోని ముత్యాలమ్మ కోనేరు, నెహ్రూ పార్కు ఆవరణలో ఇవాళ ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ పలాస-కాశీబుగ్గ ప్రతినిధులు శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.