విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్ బృందంతో రంగంలోకి దిగిన అధికారులు విజయ్ ఇంటిని జల్లెడ పట్టారు. ఇంటి ఆవరణలో పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.