చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
KNR: శంకరపట్నం (M)మొలంగూర్ ఎక్స్ రోడ్డులో శుక్రవారం లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. మెట్‌పల్లి గ్రామానికి చెందిన అంతడుపుల నరేష్‌కు తీవ్ర గాయాలై రోడ్డుపై అపస్మారస్థితిలోకి వెళ్లారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లారీ డ్రైవర్ పై మృతుడి తండ్రి మొండయ్య ఫిర్యాదు చేశారు.